చర్చకు రమ్మన్నది నిన్ను కాదు.. మీ నాయనను : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

చర్చకు రమ్మన్నది నిన్ను కాదు..  మీ నాయనను : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • అసెంబ్లీలో చర్చిద్దాం రా.. ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్ ఎందుకు?

హైదరాబాద్, వెలుగు: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అసెంబ్లీలో చర్చకు పిలిస్తే, ఆయనను పక్కనపెట్టి కేటీఆర్ ఎందుకు వస్తున్నారని.. అది కూడా అసెంబ్లీకి​ కాకుండా ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌కు ఎందుకని పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ నిలదీశారు. గతంలో మాదిరి తమ ప్రభుత్వంలో నిర్బంధాలు లేవని.. అందుకే బీఆర్ఎస్​ నేతలు ధర్నాలు, చర్చలు చేయగలుతున్నారన్నారు. బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్.. మంగళవారం సోమాజిగూడ  ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలంటూ సవాల్​విసరడంతో పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుని సీఎల్పీ నుంచి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కౌంటర్​ ఇచ్చారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించాలంటే అసెంబ్లీ ఉందని, బయట సవాళ్లు విసరడం ఎందుకని ప్రశ్నించారు. 

పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌గా తాను స్పందించే స్థాయి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది కాదన్నారు. ‘‘మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరిగిన ప్రతి అసెంబ్లీ సెషన్‌‌‌‌‌‌‌‌లో ప్రతిపక్షాలకే ఎక్కువ సమయం ఇచ్చాం. దీన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తించాలి. పదేండ్ల పాటు తెలంగాణలో నిర్బంధ పాలన సాగించిన బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రజాస్వామ్యం, చర్చల గురించి మాట్లాడుతున్నది. కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో అవకతవకలపై ఎవరు మాట్లాడినా గతంలో అరెస్టులు చేశారు. ఆ ప్రాజెక్టు వద్దకు వెళ్దామంటే నిర్బంధించారు. బీఆర్ఎస్​పాలనలో ప్రతి నెలలో కనీసం 15 సార్లు ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాల నాయకుల హౌస్ అరెస్టులు ఉండేవి. ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు జరిగేవి. నన్ను రోజంతా బొల్లారం పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఉంచేవారు. అలాంటి పాలన సాగించిన నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం.. చర్చలు అంటూ గగ్గోలు పెట్టడం వింతగా ఉంది” అని అన్నారు. 

సీఎంను విమర్శించే స్థాయి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేదు: కవ్వంపల్లి 

సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేదని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే ‘మొండి రంపంతో నాలుక కోస్తా.. జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి అని అన్నారు. తమది రైతు ప్రభుత్వమైతే, వాళ్లది (బీఆర్ఎస్) రైతులను ముంచిన ప్రభుత్వమని విమర్శించారు. 

నీకు దమ్ముంటే.. మీ నాయనను అసెంబ్లీకి తీసుకురా: అద్దంకి

కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దమ్ముంటే వాళ్ల నాయన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొ ని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌తో చర్చకు రావాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. లేదంటే దద్దమ్మగా మిగిలిపోవడం తప్ప లాభం లేదన్నారు. ‘‘కేసీఆర్...అసెంబ్లీకి వచ్చే దమ్ము నీకు ఉందా? లేదా? కనీసం అదైనా ప్రకటించు. అసెంబ్లీకి రాని దొంగలు మీరు’’ అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అసెంబ్లీ అంటే  గౌరవం లేదని, అందుకే ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో చిల్లరవేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘‘కేటీఆర్ ఇలాంటి చిల్లర  చేష్టలు ఇకనైనా మానుకో.. లేదంటే మురిగి కాలువలో మునిగి చచ్చిపో..’’ అని ఫైర్​అయ్యారు. ఏ డాక్టర్ కూడా బాగు చేయలేని పరిస్థితిలో కేటీఆర్ ఉన్నారని అన్నారు.

కేసీఆర్ అడిగితే అసెంబ్లీ పెట్టేందుకు సిద్ధం: రామ్మోహన్ రెడ్డి 

‘‘కేటీఆర్... మీ నాయకుడు లెటర్ ఇస్తే అసెంబ్లీ సమావేశాలు పెట్టేందుకు మేం సిద్ధం” అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. లెటర్ ఇవ్వకుండా ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి రచ్చ చేయడం ఏంటని ప్రశ్నించారు. ‘‘మీ నాయకుడితో లెటర్ ఇప్పించండి. అసెంబ్లీ ఎప్పుడు పెట్టమంటారో కూడా మీరే చెప్పండి. అందుకు మేం సిద్ధం. హరీశ్ రావు పెద్ద, పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మా సీఎంను ఏం చేయలేడు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వం” అని అన్నారు.  

కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ ఆరో వేలు: యెన్నం

కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ ఆరో వేలుతో సమానమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చివరకు హరీశ్ కూడా కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అలాగే చూస్తున్నాడని అన్నారు. ‘‘తన అన్నయ్యకు నాయకత్వ లక్షణాలు లేవని చివరకు కవిత కూడా అంటోంది. కొడుకును సీఎం చేయాలని అనుకుంటున్న కేసీఆర్.. చివరకు పార్టీ ప్రెసిడెంట్ ను కూడా చేయలేకపోతుండు. అది కేటీఆర్ పరిస్థితి. అలాంటి కేటీఆర్ సీఎం  రేవంత్ రెడ్డిని విమర్శించడం ఏమిటి?” అని మండిపడ్డారు. 

కేటీఆర్.. నువ్వో బచ్చా: బీర్ల అయిలయ్య

‘‘కేటీఆర్.. నువ్వో బచ్చా. సీఎం రేవంత్ రెడ్డిని ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌కు రమ్మంటావా?” అని విప్ బీర్ల అయిలయ్య మండిపడ్డారు. ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ కేటీఆర్.. మీ నాయన ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌కు పరిమిమైతే, నువ్వు మాత్రం ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌కు వచ్చి రేవంత్‌‌‌‌‌‌‌‌పై చిల్లర మాటలు మాట్లాడుతావా? రాయలసీమకు పోయి రొయ్యల పులుసు తిని తెలంగాణకు నీళ్లు లేకుండా చేసింది మీ నాయన. అలాంటి మీరు ఇప్పుడు బనకచర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంకోసారి సీఎం రేవంత్ రెడ్డిపై చిల్లర మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడుతారు” అని హెచ్చరించారు.

అసెంబ్లీలో చర్చంటే భయమెందుకు?: బల్మూరి 

హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో రాజకీయాలపై చర్చించడానికి సమయం ఉన్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. అసెంబ్లీకి వచ్చి చర్చించేందుకు భయమెందుకని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో తన ఉనికి కోసమే సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అరుస్తున్నారని మండిపడ్డారు. ‘‘కేటీఆర్ పారాచ్యూట్ నేత. రేవంత్ కింది స్థాయి నుంచి వచ్చిన నేత. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, కానీ కేటీఆర్ మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో స్టంట్‌‌‌‌‌‌‌‌లు చేస్తున్నాడు. కేటీఆర్ ఇలానే మాట్లాడితే తెలంగాణ ప్రజలు రాళ్లతో కొడుతారు” అని హెచ్చరించారు.