నిజామాబాద్​ రైతులు నాలుగోసారి రోడ్డెక్కారు

నిజామాబాద్​ రైతులు నాలుగోసారి రోడ్డెక్కారు

వెలుగు: పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్ తో నిజామాబాద్​ జిల్లా రైతులు సోమవారం మరోసారి రోడ్డెక్కారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపైకి ఉదయం 11 గంటల వరు వేల సంఖ్యలో రైతులు చేరుకున్నారు. రాస్తారోకో, వంటా వార్పు కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలిపారు. 20 రోజుల్లో నాలుగుసార్లు రోడ్డెక్కి నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 7 గంటల వరకు ధర్నా కొనసాగించారు. ఆ తర్వాత ఆర్మూర్ నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్మూర్ మార్కెట్ యార్డు వద్ద సమావేశమై అక్కడి నుంచి కామారెడ్డి మీదుకు హైదరాబాద్ చేరనున్నట్లు తెలిపారు. తమ గోడు సీఎం కేసీఆర్ తో చెప్పుకోవడానికి రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర కల్పిం చాలనే డిమాండ్ తో రైతులు మెట్ పల్లి 63వ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అలాగే జగిత్యా ల–కరీంనగర్ ప్రధాన రహదారి థరూర్ బ్రిడ్జ్ వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన నిర్వహించారు.