
నిజామాబాద్క్రైమ్, వెలుగు: మైనర్‌ను రేప్‌చేసిన వ్యక్తికి 20 ఏడ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. ఎస్ హెచ్ వో సైదేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్జిల్లా ఆర్మూర్మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కు చెందిన రాచర్ల వంశీకృష్ణ పెండ్లి చేసుకుంటానంటూ మైనర్‌ను మోసం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో తల్లి 29 సెప్టెంబర్ 2020న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ కావడంతో పోక్సో, రేప్ కేసు నమోదు చేసి ఏసీపీ రఘు ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి (పోక్సో కోర్టు) సి.హెచ్ పంచాక్షరీ బుధవారం తీర్పు చెప్పారు.