కోటగిరి, వెలుగు: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్పూర్కు చెందిన బి.సాయిలత తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైంది. ఎస్సై శ్రీనివాస్ యాదవ్ వివరాల ప్రకారం.. శుక్రవారం భర్త ప్రశాంత్ తో గొడవ పడ్డ సాయిలత పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయింది.
గ్రామం పక్కనే ఉండే ఎత్తొడ క్యాంప్ లో ఉన్న అత్తగారింటికి ప్రశాంత్ సమాచారం అందించగా.. తమ ఇంటికి రాలేదని మామ లక్ష్మణ్తెలిపాడు. ఎంతవెతికినా వారి జాడ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
