ఇందూర్ ను ఓల్డ్ సిటీగా మార్చే కుట్ర : ధన్ పాల్ సూర్య నారాయణ

ఇందూర్ ను ఓల్డ్ సిటీగా మార్చే కుట్ర : ధన్ పాల్ సూర్య నారాయణ

నిజామాబాద్​అర్బన్​, వెలుగు: చారిత్రక నేపథ్యం ఉన్న ఇందూరు నగరాన్ని పాతబస్తీలా మార్చడానికి కాంగ్రెస్​  కుట్రలు చేస్తుందని అర్బన్​ఎమ్మెల్యే ధన్​పాల్​సూర్యనారాయణ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హైదరాబాద్ మహా నగరంలో దాదాపు 5 లక్షల బోగస్​ ఓట్లు ఉన్నాయని ఇటీవల కాంగ్రెస్​ నాయకుడు ఫిరోజ్​ఖాన్​బహిరంగంగా చెప్పాడన్నారు.

ఇందూరులో కూడా పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల నగరంలోని ఒక డివిజన్​పరిధిలో కొత్తగా  280 ఓట్లు నమోదైతే అందులో 274 ఓట్లు ముస్లిం వారివే కావడం గమనించాలన్నారు.  అధికారంలో ఉన్న కాంగ్రెస్​ తమ అధికార బలంతో తమకు అనుకూలంగా ఉన్న బూత్‌ల్లో ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా వందల సంఖ్యలో బోగస్​ఓట్లను సృష్టిస్తున్నారని ఆరోపించారు.  ఇందూరు గడ్డపై విజయం సాధించడానికి విపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన కాషాయజెండా రెపరెపలాడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  బోగస్​ఓట్లపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.  సమావేశంలో కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.