
ఉమ్మడి నిజామాబాద్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార TRS పార్టి విజయడంకా మోగించింది. నిజామాబాద్, కామారెడ్డీ జెడ్పి చైర్మన్ లతో పాటు మెజారిటి సంఖ్యలో మండల పరిషత్ లు గెలుకుంది టిఆర్ఎస్. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంది ఫలితాల్లో టిఆర్ఎస్ దూసుకుపోయింది. అయితే గతంతో పోల్చితే బిజేపి బాగా పుంజుకుంది.
నిజామాబాద్ జెడ్పీ పీఠంతో పాటు మెజారిటి ఎంపీపీలను అధికార టీఆర్ఎస్ దక్కించుకుంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 27 జెడ్పిటిసి స్థానాలకు గాను టిఆర్ఎస్-23, కాంగ్రెస్-2, బీజేపీ-2 స్థానాల్లో గెలుపొందింది. జెడ్పీ పీఠం ఈ సారి కూడా టిఆర్ఎస్ దక్కించుకుంది. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోరుకుంటున్న వారంతా జెడ్పిటిసిలుగా గెలవడంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 299 ఎంపిటిసి స్థానాలకు గాను టిఆర్ఎస్-199, కాంగ్రేస్-41, బిజేపి-32, ఇతరులు -27 మంది ఎంపిటిసిలుగా ఎన్నికయ్యారు.
కామారెడ్డీ జిల్లాలో మొత్తం 22 జెడ్పిటిసిలకు గాను టిఆర్ఎస్-14, కాంగ్రేస్-8 చోట్ల విజయం సాదించింది. తొలిసారిగా ఏర్పడ్డ కామారెడ్డీ జిల్లా పరిషత్ అధికార పార్టి ఖాతాలోకి వెళ్ళీంది. కామారెడ్డీ జిల్లాలో మొత్తం 236 ఎంపిటిసిలకు గాను, టిఆర్ఎస్-149, కాంగ్రేస్-61, బిజేపి-4, ఇతరులకు -22 స్థానాలు దక్కాయి.
టీఆర్ఎస్ కు ఊరట
ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టిఆర్ఎస్ పార్టికి ఈ ఫలితాలు ఊరటనిచ్చాయి. మాజీ ఎంపి కవిత స్వగ్రామం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్ గ్రామంలో ఎంపిటిసిగా బీజేపీ గెలిచింది. శాసన సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉన్నా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఓడిపోయామన్న చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది.
ఉమ్మడి జిల్లాలో అప్పుడే క్యాంపు రాజకీయం సందడి కనిపిస్తోంది. మెజారిటీ మండల పరిషత్ లు దక్కించుకునే క్రమంలో అవసరమైతే స్వతంత్రులు, ఇతర పార్టీ సభ్యులకు గాలం వేస్తున్నాయి పార్టీలు. తమ పార్టీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడంతో… బీజేపీ నేతలు అడ్డుకున్నారు.