నిజామాబాద్​ జిల్లాలో సీపీ మార్క్​ పోలీసింగ్ .. లంచగొండి స్టాఫ్​పై డైరెక్ట్​ యాక్షన్​

నిజామాబాద్​ జిల్లాలో సీపీ మార్క్​ పోలీసింగ్ .. లంచగొండి స్టాఫ్​పై డైరెక్ట్​ యాక్షన్​
  • క్రికెట్​ బెట్టింగ్, ఆన్​లైన్​, గల్ఫ్​ మోసాలపై ఫోకస్​
  • పర్మిషన్​లేని చిట్​ఫండ్​ వ్యాపారులపై కేసులు

నిజామాబాద్, వెలుగు:  నిజామాబాద్​ పోలీస్​ కమిషనర్​ సాయి చైతన్య  జిల్లాలో తన మార్కు చూపిస్తూ అక్రమాలకు చెక్​ పెడుతున్నారు.  గతేడాది అక్టోబర్​లో నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్​ సింగనెవార్​ ట్రాన్స్​ఫర్​ అయ్యారు. మార్చి 10 తర్వాత రెగ్యులర్​ సీపీగా సాయి చైతన్య బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో  సమర్థవంతంగా పనిచేసే పోలీస్  స్టాఫ్ ను స్పెషల్ ‘దర్బార్’ పేరుతో సన్మానిస్తున్నారు. అవినీతి చేస్తున్న ఆఫీసర్లను ఇంటికి సాగనంపుతున్నారు.  దీంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. 

ప్లాన్​ లీక్​ కాకుండా యాక్షన్​లోకి

సిటీలో ఇసుక రవాణా, మొరం ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టుకు అండగా ఉంటున్న ​ట్రాఫిక్​ ఏసీపీ నారాయణపై డీజీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు సీక్రెట్‌‌‌‌‌‌‌‌ రిపోర్టు పంపారు. దీంతో ఆయనను ఈ నెల 8న జిల్లా నుంచి ట్రాన్స్ ఫర్ చేశారు. జాబ్స్​ ఇప్పిస్తానని రూ. లక్షలు వసూలు చేసి నిరుద్యోగులను మోసం చేసిన రుద్రూర్​ కానిస్టేబుల్​ సిద్ధిరామ్​ చిన్నయ్య​పై కేసు నమోదు చేసి ఈనెల 2న సస్పెండ్​ చేశారు. లంచాల వసూలు చేస్తున్నట్లు గుర్తించి కోర్టు లైజనింగ్​ ఆఫీసర్​ గజానంద్​ జాదవ్​పై వేటు వేశారు.  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బోధన్​ రూరల్​ సీఐ విజయ్​బాబు నుంచి సంజాయిషీ కోరారు. దీంతో పాటు విధుల్లో  నిర్లక్ష్యం చేస్తున్న తొమ్మిది మంది ఎస్‌‌‌‌‌‌‌‌ఐలకు మెమోలు జారీ చేశారు.  జిల్లాలోని ప్రతి ఠాణా పనితీరుపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ఎస్బీ నివేదికలు తెప్పించుకొని సిబ్బందిపై పూర్తి కంట్రోల్​ సాధించారు. 

హైలెట్‌‌‌‌‌‌‌‌గా చీటీ వ్యాపారులపై రైడ్స్ ​

ప్రజల ఆర్థిక అవసరాల బలహీనతను ఆసరా చేసుకొని వడ్డీ దందా చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించారు.  గత నెల జిల్లా వ్యాప్తంగా15  మంది పై కేసులు నమోదు చేసి రూ. 85 లక్షల సొమ్మును కోర్టులో డిపాజిట్​ చేశారు. 1,435 ప్రామిసరీ నోట్లు, 30 బాండ్​ పేపర్స్​, 43 రిజిస్ట్రేషన్​ సేల్​డీడ్స్​తో పాటు ఆర్థిక లావాదేవీలకు చెందిన 31 పేపర్స్ కోర్టుకు అందజేశారు.  80 మందిని మోసం చేసి రూ.లక్షలు ఎగ్గొట్టిన మహిళ, ఐదుగురు గల్ఫ్​ఏజెంట్లను నందిపేటలో గుర్తించి జైలుకు పంపారు.  క్రికెట్​బెట్టింగ్​రాకెట్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిది మందిపై కేసులు పెట్టి ఐదుగురిని అరెస్టు చేయించారు.  కాలేజీ స్టూడెంట్స్ ఉండే ​ హాస్టల్స్‌‌‌‌‌‌‌‌లో గంజాయి ఆనవాళ్లు గుర్తించడానికి తనిఖీలు చేపట్టారు.  పాత నేరస్తుల కదలికలు ఈజీగా గుర్తించడానికి వారి ఫింగర్​ ప్రింట్, ఆధార్, ఫోన్​ నంబర్ల సేకరణ మొదలుపెట్టారు. 

యాక్సిడెంట్ల నివారణకు ప్రయారిటీ

ఎన్​హెచ్​44 పై పెర్కిట్​ బైపాస్​, కరీంనగర్​ అండర్​ పాస్​ జంక్షన్​ వద్ద యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నట్లు గుర్తించిన సీపీ సాయి చైతన్య ఫీల్డ్​ విజిట్​ చేసి  మార్పులు సూచిస్తూ హైవే అథారిటీకి పది రోజుల క్రితం లెటర్​ పంపారు.  మైనర్లకు వెహికల్స్​ ఇచ్చి బయటకు పంపుతున్న పేరెంట్స్​కు జరిమానాలు విధిస్తున్నారు. వివిధ నేరస్తుల జాడ తెలుసుకోడానికి వెహికల్స్​చెకింగ్ పెంచారు.  కొన్ని చోట్ల ఆయనే చెకింగ్​ చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత హోటల్స్​ క్లోజ్​ చేయిస్తున్నారు.  

పట్టించుకోని 50 మందిపై  కేసులు పెట్టి జైలుకు పంపారు. యూత్​ మిడ్​నైట్​ తిరుగుళ్లను నియంత్రించారు.  నగరంలో రోడ్​ ఆక్రమణలతో వెలిసిన షాప్​లను తొలగించారు.  పోలీస్​ సిబ్బంది మంచి చెడులు దర్బార్​ ద్వారా తెలుసుకోవడమే కాకుండా గతంలో పనిచేసిన సీపీలకు భిన్నంగా సోషల్​ యాక్టివిటీస్​లో యాక్టివ్​గా ఉంటూ ప్రజలకు చేరువవుతున్నారు.