బారులో పబ్ కల్చర్.. మద్యం మత్తులో బీర్ బాటిళ్లతో దాడి..

బారులో పబ్ కల్చర్.. మద్యం మత్తులో బీర్ బాటిళ్లతో దాడి..

మద్యం మత్తులో అర్థరాత్రి వరకు బారులో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తూ అడ్డు వచ్చిన వారిపై బీర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. 

నిజామాబాద్ పట్టణంలోని ఓ బారు.. డ్యాన్స్ క్లబ్ గా మారింది. కొత్త కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఈ బారు ఏర్పాటు చేశారు. బారు పేరుతో పబ్ కల్చర్ కు తెరలేపారు.  అర్థరాత్రి వరకు ఫుల్లుగా తాగి మద్యం మత్తులో యువకులు డ్యాన్స్ చేస్తూ.. గొడవకు దిగారు. ఆ తర్వాత బీరు బాటిళ్లతో  రెచ్చిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.