నిజామాబాద్‌లో ట్రాఫిక్​ పోలీసులు స్పెషల్ డ్రైవ్

 నిజామాబాద్‌లో ట్రాఫిక్​ పోలీసులు స్పెషల్ డ్రైవ్

​నిజామాబాద్​వెలుగు ఫొటోగ్రాఫర్ : రోడ్డు ప్రమాదాలు తగ్గించే క్రమంలో నిజామాబాద్​  నగరంలో ట్రాఫిక్​ పోలీసులు ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్​ డ్రైవ్​లో పట్టుబడిన, రిజిస్ట్రేషన్ లేని వాహనాలను సీజ్ చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటీవల బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం రోడ్డు ప్రమాదాలకు మైనర్లు కారణమని తేలడంతో తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు.  

తల్లిదండ్రుల్లో మార్పు రావాలని మైనర్లతో ప్లకార్డుల ప్రదర్శన చేయించాలని భావిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు ఏకంగా జైలు పాలయ్యారు. అయినా కొందరు మైనర్లు మాత్రం దర్జాగా టూ వీలర్స్ నడుపుతున్నారు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు కమిషనరేట్ పోలీసులు స్పెషల్​ డ్రైవ్​కు శ్రీకారం చుట్టారు.