
నిజామాబాద్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిజామాబాద్ అర్బన్ నుంచి స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యమగంటి కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయినగర్ లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ వేధింపుల వల్లే కన్నయ్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ కుమారుడు నాయకుడు అవుతాడని అనుకున్నాం కానీ ఇలా కానరాని లోకాలకు వెళ్తాడనుకోలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.