
నందిపేట, వెలుగు: నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి వయా నందిపేట, కొండూర్మీదుగా నిర్మల్‌జిల్లా లోకేశ్వరం గ్రామానికి ఆర్టీసీ బస్సును శనివారం అధికారులు ప్రారంభించారు. ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి మీదుగా ఇది లోకేశ్వరం గ్రామానికి వెళ్తుంది. కేవలం 40 కిలోమీటర్ల ప్రయాణంతో జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు. బస్సు ప్రతీరోజు 5 ట్రిప్పులు నడుస్తుందని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆఫీసర్లు తెలిపారు.