సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశం

సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశం

విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్ల పై విద్యార్థుల ఆధార్ నంబర్ ను ముద్రించవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) యూనివర్సిటీలను ఆదేశించింది. 

స్టూడెంట్స్ పర్సనల్ డేటా పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంటే విద్యార్థులకు ఇచ్చే డిగ్రీలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ప్రింట్ చేయవద్దన్నమాట. 

కొన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు, రిక్రూట్ మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ నంబర్ ని పరిగణలోకి తీసుకుంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల పరిధిలో సర్టిఫికేట్లలో ఆధార్ సంఖ్య అనేది తప్పనిసరిగా మారింది. 

ఇది సరికాదని యూజీసీ స్పష్టం చేసింది. వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయడం ఆమోదయోగ్యం కాదని యూజీసీ చెప్పింది. 

బదులుగా, అన్ని వర్సిటీలు యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని యూజీఎసీ సెక్రటరీ మనీష్ జోషి యూనివర్సిటీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.