దేశంలో ఒక్క కేసు కూడా లేదు

V6 Velugu Posted on Nov 29, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంబంధిత కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కేసులు ఉన్నాయనే అనుమానంతో మహారాష్ట్రలో ఒకటి, కర్నాటకలో రెండు క్లస్టర్లను పరిశీలనలో ఉంచామని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు. మహారాష్ట్ర డోంబ్విలీలోని ఓవ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు ఇండియాలో ఎవరికీ ఒమిక్రాన్ సోకలేదని స్పష్టం చేసింది. 

కాగా, కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాదకర కేటగిరీలో చేరుస్తూ హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 22 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్ రోగ నిరోధక శక్తిని కూడా ఛేదించి సోకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ వో వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. పలు ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసి, వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉంచాలని స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తల కోసం: 

సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం

మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు కీలక తీర్పు

డాలర్ శేషాద్రి ప్రస్థానం.. ప్రశంసలు, వివాదాలు

Tagged Central government, India, Maharashtra, karnataka, WHO, Omicron variant

Latest Videos

Subscribe Now

More News