పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గలేదు.. జనవరి ఫస్ట్ రోజున పాత రేట్లు

పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గలేదు.. జనవరి ఫస్ట్ రోజున పాత రేట్లు

నాలుగైదు రోజులుగా.. 2024, జనవరి ఒకటో తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోల్ రేట్ల తగ్గింపు అనేది ఆయా కంపెనీల ఆలోచన మాత్రమే అని.. ఎప్పటి నుంచి తగ్గిస్తారనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదని తేలిపోయింది. జనవరి ఒకటో తేదీ నుంచి లీటర్ పెట్రోల్ పై 10 రూపాయలు, లీటర్ డీజిల్ పై ఎనిమిది రూపాయల వరకు తగ్గింపు ఉంటుంది అంటూ వార్తలు వచ్చాయి. జనవరి ఒకటో తేదీ వచ్చినా ఏ ఆయిల్ కంపెనీ పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించలేదు. కొత్త ఏడాది మొదటి రోజు కూడా పాత ధరలే కొనసాగాయి. అవే రేట్లు ఉన్నాయి.

కొన్ని రోజులుగా జనవరి ఒకటిన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్నాయనే వార్తలతో జనం ఖుషీ అయ్యారు. న్యూ ఇయర్ ఫస్ట్ డే హ్యాపీ న్యూస్ అంటూ ఆనందపడ్డారు. తీరా జనవరి ఒకటో తేదీ వచ్చిన తర్వాత.. పెట్రోల్ బంకుల్లోకి వెళ్లిన వాహనదారులు షాక్ అయ్యారు. పాత ధరలే ఉన్నాయి. పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయని వార్తలు వచ్చాయి.. మీరు ఎందుకు ధరలు తగ్గించలేదంటూ బంకులోని కుర్రోళ్లను ప్రశ్నించటం కనిపించింది. మాకు ఎలాంటి సమాచారం లేదు.. రేట్లు తగ్గించమని మా యజమానులు చెప్పలేదు అంటూ సమాధానం వస్తుంది. 

మొత్తానికి న్యూ ఇయర్ ఫస్ట్ డే రోజున.. పెట్రోల్, డీజిల్ పాత రేట్లే ఉన్నాయి. ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ సిటీలో లీటర్ పెట్రోల్ 109 రూపాయల 66 పైసలు.. ఎలాంటి మార్పు లేదు.. అదే విధంగా లీటర్ డీజిల్ 97 రూపాయల 82 పైసలు.. ఎలాంటి మార్పు లేదు.. వాహనదారులు డోంట్ హ్యాపీ.. బీ కూల్..