పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం

పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ ఛైర్మన్ చెవుల స్వప్న చిరంజీవి, వైస్ ఛైర్మన్ చామ సంపూర్ణ శేఖర్ రెడ్డిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తీర్మానం కాపీని అందజేశారు. 2020లో జరిగిన ఎన్నికల్లో 24వార్డులకుగానూ బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 13, బీజేపీ, సీపీఐ, ఇండిపెండెంట్ ఒక్కో స్థానంలో గెలుపొందారు. బీఆర్ఎస్ కు చెందిన స్వప్న చిరంజీవిని మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నుకున్నారు. తాజాగా సొంతపార్టీ కౌన్సిలర్లే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం చేయడం చర్చనీయాంశంగా మారింది.