సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం

సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం

సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారి ఒంటెత్తు పోకడలతో మున్సిపాలిటీకి, పార్టీకి నష్టం జరుగుతుందని వాపోయారు. మొత్తం 38 మందిలో 28మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. తమ తమ వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధుల విడుదల చేయడంలో విజయలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. తమ సమస్యలను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు