వీగిపోయిన అవిశ్వాసం.. మూజువాణి ఓటుతో..

 వీగిపోయిన  అవిశ్వాసం.. మూజువాణి ఓటుతో..


లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్ లేకుండానే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా విపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రధాని ప్రసంగం తర్వాత స్పీకర్ ఓ బిర్లా అవిశ్వాస తీర్మానంపై మూజువాణీ ఓటింగ్ నిర్వహించారు. అనంతరం అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ ఓ బిర్లా ప్రకటించారు. 

అంతకు ముందు ప్రధాని మోదీ అవిశ్వాసంపై సుదీర్ఘంగా ప్రసంగించారు.  మొత్తం 2గం.13 నిమిషాలపాటు ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ సహా విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2018లోనూ అవిశ్వాసం పెట్టిన తీరును గుర్తు చేసిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ పెట్టే ప్రతి అవిశ్వాస తీర్మానం తమకు ఆశీర్వాదంగా మారుతుందన్నారు.  2024 ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేపడతామని మోదీ ధీమా వ్యక్తం చేశారు.  ఇటీవల కర్నాటకలో UPAకు కర్మకాండలు జరిపించారన్నారు. మళ్లీ సజీవంగా ఉంచడానికి చివరకు NDAనే ఉపయోగించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.