గడిచిన 24 గంటల్లో కరోనా మరణాల్లేవ్

గడిచిన 24 గంటల్లో కరోనా మరణాల్లేవ్

న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలేవీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. కరోనా డెత్స్ లేకపోవడం 2020 మార్చి తర్వాత ఇదే మొదటిసారి అని చెప్పింది. కొత్తగా 625 కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. 2020 ఏప్రిల్ తర్వాత ఇవే అతి తక్కువ కేసులని, ఆ ఏడాది ఏప్రిల్ 9న 540 కేసులు నమోదయ్యాయని పేర్కొంది.

మొత్తం కేసుల సంఖ్య 4.46 కోట్లకు పెరిగిందని, యాక్టివ్ కేసుల సంఖ్య 14,021కి తగ్గిందని వివరించింది. ఇప్పటి వరకు 4.41 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారని, రికవరీ రేటు 98.78 శాతానికి పెరిగిందని తెలిపింది. మరణాల సంఖ్య 5,30,509గా ఉందని, డెత్ రేట్ 1.19 శాతంగా నమోదైందని చెప్పింది. కాగా, ఇప్పటి వరకు 219.74 కోట్ల కరోనా డోసులను వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.