
టీఎస్ జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆపివేయడం వల్లతెలంగాణ పవర్ గ్రిడ్పై ఎలాంటి ప్రభావం ఉండదని టీఎస్ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. గ్రిడ్కు ఎలాంటి సమస్య రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. లైట్లు ఆపివేస్తేగ్రిడ్ కుప్పకూలు తుందంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితంగా ఉందని, జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే తమ ఇంజనీరకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని కోరారు.
లైట్లు మాత్రమే ఆర్పేయండి
న్యూఢిల్లీ: లైట్లు ఒక్కసారే ఆర్పేస్తే గ్రిడ్ దెబ్బతింటుందనే మాట నిజం కాదని కేంద్ర విద్యుత్ శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారంరాత్రి తొమ్మిది గంటలకు దేశమంతటా లైట్లు ఆర్పేయడం వల్లవోల్టేజ్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని, దానివల్ల ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతింటాయని ప్రచారం జరుగుతోందని, అందులో
నిజం లేదని పేర్కొంది.
కేంద్రం ఇంకేం చెప్పిందంటే..
ప్రధానిపిలుపుమేరకుతొమ్మిది నిమిషాలపాటులైట్లు మాత్రం బంద్ చేయాలి.
ఇంట్లోని కంప్యూటర్లు ,ఫ్యాన్లు , ఏసీలు బంద్ చేయాల్సినఅవసరంలేదు.
దీనికోసం విద్యుత్ శాఖఅన్నివిధాలుగా సిద్ధమైంది.
వీధిదీపాలువెలుగుతూనేఉంటాయి.
ఆస్పత్రులు, ఇతర ఎమర్జెన్సీ ఆఫీసుల్లో కూడాలైట్లు వెలుగుతాయి.