మాస్క్ లేకపోతే కోర్టులోకి నో ఎంట్రీ

మాస్క్ లేకపోతే కోర్టులోకి నో ఎంట్రీ

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‭లోని నైనిటాల్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక పై మాస్కులు లేకుండా కోర్టు గదిలోకి ప్రవేశించకూడదని ఆదేశాలు ఇచ్చింది. ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కోర్టు సిబ్బంది, అధికారులు, న్యాయవాదులు అంతా మాస్క్ ధరించి.. కోవిడ్ భద్రతా నిబంధనలు పాటించాలని తెలిపింది. నైనిటాల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపిన్ షాంఘ్వీ ఆదేశాల మేరకు.. హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. 

కోర్టులోని అన్ని గదులను నిరంతరం శానిటైజేషన్ చేయాలని.. కోర్టులోపలికి రద్దీని అనుమతింవద్దని రిజస్ట్రార్ ఆదేశించారు. ఇదిలా ఉంటే.. అనేక దేశాల్లో ఇన్ ఫెక్షన్ల పెరుగుదల కారణంగా.. రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల వద్ద మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అలాగే.. ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలు, ఆక్సిజన్ సపోర్టు, ఐసీయూ బెడ్లు, బెడ్ కెపాసిటీల వివరాలపై కేంద్రఆరోగ్యశాఖ ఆరా తీయనుంది.