కరోనా వైరస్ కట్టడి కోసం లాడ్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సీఎం కేసీఆర్. శనివారం సాయంత్రం రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియా మాట్లాడారు సీఎం కేసీఆర్. ఈ నెల 14 ముగుస్తున్న లాక్ డౌన్ 30వ తేదీ వరకు కొనసాగించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రధానికి పంపుతామని చెప్పారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. నెలాఖరు తర్వాత దశల వారీగా లాక్ డౌన్ ఎత్తేస్తామన్నారు. వైరస్ కట్టడికి లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. త్వరలోనే టెన్త్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
