FIRకు విచారణ అవసరం లేదు..SC, ST కేసులపై సుప్రీం

FIRకు విచారణ అవసరం లేదు..SC, ST కేసులపై సుప్రీం

ఎస్సి, ఎస్టి కేసుల్లో ప్రాథమిక విచారణ జరపాల్సిన అవసరం లేదని చెప్పింది సుప్రీంకోర్ట్. అట్రాసిటీ కేసుల్లో  ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ పోలీస్ అధికారుల అనుమతి కూడా అవసరం లేదని తెలిపింది కోర్ట్. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం రివ్యూ పిటిషన్ వేసింది. ఈ రివ్యూ పిటిషన్ పై జస్టిస్ అరుణ్ మిశ్రా,  జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిలుకు అవకాశం కల్పించకూడదని సుప్రీం చెప్పింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం ఉంటుందని చట్ట సవరణ చేయడంతో.. కొత్త చట్టాన్ని సమర్థించింది సుప్రీంకోర్ట్. అసాధారణమైన పరిస్థితులలో FIRలను కోర్టులు కొట్టేయొచ్చని తెలిపింది సుప్రీం.