21 వరకు ఒక్క చెట్టు నరికివేయొద్దు

21 వరకు ఒక్క చెట్టు నరికివేయొద్దు

ముంబైలోని ఆరే కాలనీలో చెట్ల తొలగింపుపై మహారాష్ట్ర సర్కార్ కు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. ఆరే కాలనీలో అక్టోబర్ 21 వరకు ఒక్క చెట్టును కూడా తొలగించవద్దని జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. విచారణ పూర్తయ్యే వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని  తెలిపింది. పోలీసులు అరెస్ట్ చేసిన 29 మంది సామాజిక  వేత్తలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే నిరసనకారులకు నిన్ననే బోరీవాలీ హాలీడే కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇవాళ ఉదయం వారిలో కొందరు రిలీజ్ అయ్యారు. ఇంకా మిగిలిన వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ముంబై మెట్రో  షెడ్ కోసం ఆరే కాలనీలో చెట్ల తొలగింపు చేపట్టారు. మెట్రో కు వ్యతిరేకంగా ఆరే కాలనీ ప్రజలతో పాటు రాజకీయ నేతలు ఉద్యమిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఆరే కాలనీకి ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అయితే చెట్ల నరికివేతపై కొందరు విద్యార్థులు సీజేఐకి లేఖ రాశారు. విద్యార్థుల లేఖను సూమోటోగా  తీసుకున్నారు రంజన్ గొగొయ్. కేసు విచారణకు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఇవాళ విచారణ జరిపిన స్పెషల్ బెంచ్.. ఆరే కాలనీలో చెట్ల నరికివేతను ఆపాలని ఆదేశాలు ఇచ్చింది.