ఎప్పుడూ అవినీతి నిరోధక క్లాజ్ లేదు: ఎయిర్ మార్షల్ సిన్హా

ఎప్పుడూ అవినీతి నిరోధక క్లాజ్ లేదు: ఎయిర్ మార్షల్ సిన్హా

no-need-of-anti-corruption-clause-in-govt-to-govt-contract-air-marshal-sbp-sinhaన్యూఢిల్లీ: జీ టూ జీ (ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య జరిగే) ఒప్పందాల్లో గతంలోనూ యాంటీ కరప్షన్ (అవినీతి నిరోధక) క్లాజ్ లేదని ఎయిర్ మార్షల్ ఎస్బీపీ సిన్హా స్పష్టం చేశారు. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ తో భారత్ తరఫున చర్చలు జరిపిన సిన్హా ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు భారత్ రెండు జీ టూ జీ డిఫెన్స్ ఒప్పందాలు చేసుకుందన్నారు. అమెరికా, రష్యాతో జరిగిన ఆ రెండు డీల్స్ లో కూడా యాంటీ కరప్షన్ క్లాజ్ లేదని సిన్హా వివరించారు. ఇప్పుడు మూడో జీ టూ జీ డీల్ ఫ్రాన్స్ తో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు జరిగిందని చెప్పారు. ఇందులోనూ ఆ క్లాజ్ ను పెట్టలేదని తెలిపారు.

రాఫెల్ డీల్ లో యాంటీ కరప్షన్ క్లాజ్ ను ఎత్తేసి ప్రధాని మోడీ అవినీతికి గేట్లు తెరిచారని రాహుల్ ఇవాళ మీడియాతో అన్నారు. ఆ వ్యాఖ్యలపై సిన్హా పై విధంగా వివరణ ఇచ్చారు.