కొవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ మంచిదే

కొవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ మంచిదే

న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులకు మధ్య గ్యాప్ విషయంలో ఆందోళన చెందొద్దని కేంద్రం పేర్కొంది. టీకా డోసుల మధ్య అంతరాన్ని తగ్గించాలంటే సైంటిఫిక్ రీసెర్చ్‌లను బట్టే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త కరోనా వేరియంట్‌లు వచ్చే ప్రమాదం ఉన్నందున కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య అంతరాన్ని తగ్గించాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. వీటిపై నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) వీకే పాల్ స్పందించారు. ‘భయపడాల్సిందేమీ లేదు. టీకా డోసుల మధ్య అంతరాన్ని అర్జెంట్‌గా తగ్గించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. సెకండ్ డోస్‌కు ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వల్ల తొలి డోస్ తీసుకోని చాలా మందికి వ్యాక్సిన్ ఇవ్వొచ్చు. దీని వల్ల ఎంతోమందిలో ఇమ్యూనిటీని పెంచొచ్చు’ అని వీకే పాల్ చెప్పారు.