విదేశాల్లో ఉన్నోళ్లు..గడువులోపు అమెరికాకు తిరిగి రావాల్సిన అవసరం లేదు

విదేశాల్లో ఉన్నోళ్లు..గడువులోపు అమెరికాకు తిరిగి రావాల్సిన అవసరం లేదు

H1B వీసాలపై ఫీజు పెంపు క్రమంలో H1B వీసా నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి.. కొత్తవారికా?పాతవారికి కూడా వర్తిస్తుందా..? అనే సందేహాలు తలెత్తాయి. H1B వీసా నిబంధనలతో బెంబేలెత్తిన కంపెనీలు తమ ఉద్యోగులను ఆదివారం లోపు అమెరికాకు తిరిగి రావాలని అత్యవసర సమాచారం అందించింది.. అయితే దీనిపై అమెరికా అడ్మినిస్ట్రేషన్ క్లారిటీ ఇచ్చింది. 

H-1B వీసా నిబంధనలు కొత్తగా అప్లయ్ చేసుకునే వారికి మాత్రమే.. ఆల్ రెడీ ఉన్నవారికి కాదు.. మీరేం భయపడాల్సిన అవసరం లేదు..విదేశాల్లో ఉన్న H1B వీసా హోల్డర్లు ఆకస్మికంగా అమెరికాకు తిరిగి రావాల్సిన అవసరం లేదని తెలిపింది. 

H-1B వీసాలపై కొత్తగా ప్రకటించిన లక్ష డాలర్ల ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది..ఇప్పటికే ఉన్న వీసాదారులకు కాదని US పరిపాలన సీనియర్ అధికారి క్లారిటీ ఇచ్చారు.  మరోవైపు అమెరికాకు వచ్చేవాళ్లు, దేశం వదిలి వెళ్తున్న వారు, భారత్ కు వెళ్లే వాళ్లు తొందరపడి తిరిగి రావాల్సిన  అవసరం లేదని లక్షడాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం  వలస కార్మికుల ప్రవేశంపై కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. దీని ప్రకారం..అమెరికాకు ఉద్యోగం కోసం వచ్చే వారికి ఇచ్చే H1B ఫీజు కు సంబంధించిన భారీ సవరణ చేశారు.  H1B వీసా దరఖాస్తులపై వార్షిక ఫీజును లక్షడాలర్లకు పెంచారు. అయితే ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. H1B వీసా ఫీజు పెంచితే అమెరికాకే నష్టం అంటూ అక్కడి లామేకర్స్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. 

H1B వీసా ఫీజు సెప్టెంబర్ 21 అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. అయితే కంపెనీలు యూఎస్ వెలుపల ఉన్న H1B హోల్డర్లు లేదా వారి కుటుంబ సభ్యులు వెంటనే తిరిగి రావాలని  లేకుంటే అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని  ఇమ్మిగ్రేషన్ లాయర్లు సలహా ఇచ్చారు. ఈ క్రమంలో వీసా హోల్డర్లలో గందరగోళం నెలకొంది. దీంతో అమెరికా అడ్మినిస్ట్రేషన్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. H1B వీసా ఫీజు పెంపు కేవలం కొత్త వారికి మాత్రమే.. ఆల్ రెడీ ఉన్న  వీసా ఉన్న వారికి కాదు అని స్పష్టం చేసింది.