
ఎల్బీనగర్, వెలుగు: వెహికల్స్కు సరైన రిజిస్ట్రేషన్, నంబర్ప్లేట్లు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ జాయింట్ సీపీ వి.సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం ఎల్బీనగర్ ట్రాఫిక్ టీటీఐలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాలతో నంబర్ప్లేట్లు, రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న వెహికల్స్పై స్పెషల్ఫోకస్పెట్టామని చెప్పారు. చైన్ స్నాచింగులు, ఇతర నేరాలకు ఇలాంటి వెహికల్స్ నే వాడుతున్నారని తెలిపారు. వెహికల్కొన్న 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ట్రాఫిక్ డీసీపీ డి.శ్రీనివాస్, ట్రాఫిక్అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.a