ఎస్సీ సబ్​ప్లాన్​ నిధులను .. దారి మళ్లిస్తే.. ఒక్కరూ మాట్లాడలే

ఎస్సీ సబ్​ప్లాన్​ నిధులను .. దారి మళ్లిస్తే.. ఒక్కరూ మాట్లాడలే

 

  • దళిత క్రిస్టియన్ దండోరా జాతీయ కన్వీనర్ ప్రొ.గాలి వినోద్ కుమార్

బషీర్ బాగ్, వెలుగు: గత బీఆర్ఎస్​ప్రభుత్వం రూ.53 వేల కోట్ల ఎస్సీ సబ్​ప్లాన్​నిధులను దారి మళ్లించిందని దళిత క్రిస్టియన్ దండోరా జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చెప్పారు. ఎస్సీలకు దక్కాల్సిన రూ.వేల కోట్లను ఇతర అవసరాలకు తీసుకెళ్తున్నా.. ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం బాధాకరం అన్నారు. సబ్​ప్లాన్​నిధులపై దళిత బిడ్డలకు అవగాహన కల్పించి, చైతన్య పరిచేందుకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గురువారం హైదర్​గూడలోని ఎన్ఎస్ఎస్​లో ‘జై భీమ్ గ్లోబల్ కమ్యూనిటీ నెట్ వర్క్’ యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్​కుమార్​మాట్లాడుతూ.. దళితులను సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ఈ యూప్ ఉపయోగపడుతుందన్నారు. వివక్ష, అణిచివేత, నిరాదరణను ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. యాప్ ద్వారానే వ్యాస రచన పోటీలు నిర్వహిస్తామని, ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 20 వరకు పోటీలు కొనసాగుతాయని, పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న దళిత స్టూడెంట్లు యాప్ లో సూచించిన మొబైల్ నంబర్ కు వ్యాసాలు పంపించాలని సూచించారు.