నన్ను కొనే శక్తి ఎవరికీ లేదు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నన్ను కొనే శక్తి ఎవరికీ లేదు :  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తనను కొనే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదని, అమ్ముడుపోయే వాన్నే అయితే మళ్లీ కాంగ్రెస్‌లోకి ఎందుకు వస్తానని మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం మునుగోడులోని క్యాంపు ఆఫీస్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను కొద్దిరోజులు కాంగ్రెస్‌ను వదిలిపెట్టి వెళ్లినా.. మునుగోడు కార్యకర్తలు తలదించుకునే పని ఏనాడు చేయలేదన్నారు.  ఎంపీ పార్లమెంట్‌కు పంపిస్తే తెలంగాణ కోసం కొట్లాడానని, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు.  

తాను రాజీనామా చేసి కేసీఆర్‌‌తో సహా మంత్రులు బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యేలందరినీ మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరకు తీసుకొచ్చానన్నారు. మునుగోడుకు రూ. 500 కోట్ల నిధులు,  గట్టుప్పల్ మండలం , చండూరును రెవెన్యూ డివిజన్, చౌటుప్పల్ లో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటయ్యాయన్నారు. విచ్చలవిడిగా అవినీతి చేస్తున్న కేసీఆర్‌‌ కుంటుంబాన్ని జైలుకు పంపి తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలని బీజేపీలోకి వెళ్లానని, ఆ పని జరగకపోవడంతో సొంతగూటికి వచ్చానని చెప్పారు. 

ALSO READ : బతికుండగానే వృద్ధురాలికి నరకం.. చేతులు విరిచి వైకుంఠధామంలో వదిలిన్రు

ఈ  సమావేశంలో  టీపీసీసీ ప్రధానకార్యదర్శి పున్న కైలాష్ నేత, ఏఐసీసీ సభ్యులు పాల్వాయి స్రవంతి, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి నేర్లకంటి, నాయకులు కుంభం శ్రీనివాస్ రెడ్డి, పోలగోని సత్యం, నన్నూరి విష్ణువర్ధన్ రెడ్డి, బూడిద లింగయ్య యాదవ్, పాలకూరి యాదయ్య, తాడూరి వెంకట్ రెడ్డి, మారగోని అంజయ్య, దోటి వెంకన్న, బీమనపల్లి సైదులు, కోడి గిరిబాబు, జాల వెంకన్న,  మునగాల రమణా రెడ్డి, పందుల భాస్కర్, తాటికొండ సైదులు తదితరులు పాల్గొన్నారు.