బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలు బంద్

బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలు బంద్

పెట్రోల్ అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ఏ పెట్రోల్ బంకుల్లోనూ బాటిళ్లలో పెట్రోలును అమ్మరాదని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని పెట్రోలు బంకుల్లో దీనికి సంబంధించిన బోర్డులు ఏర్పాటయ్యాయి. పెట్రోల్ అయిపోయి దారి మధ్యలో వాహనాలు నిలిచిపోతే…బాటిళ్లతో సమీప పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తీస్కెళ్లేవారు. ప్రస్తుతం బాటిళ్లతో తీస్కెళ్లిన పెట్రోల్ ను హత్యలు, ఆత్మహత్యలకు వాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డిని… ఆమె ఆఫీసులోనే దారుణంగా హత్యచేశారు.

అంతేకాదు మరో మూడు పెట్రోల్ బెదిరింపుల ఘటనలు జరిగాయి.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్ అమ్మకాలపై పలు ఆంక్షలు విధించింది. బాటిళ్లలో పెట్రోల్ పోయకూడదని ఆయా పెట్రోల్ బంక్ ల నిర్వాహకులకు తేల్చిచెప్పింది. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. దీంతో బంకుల్లో నాట్ ఫిల్లింగ్ ఇన్ బాటిల్స్ పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. వాహనాల్లోనే పెట్రోల్ పోస్తామంటున్నారు బంకు యజమానులు.