గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ క్యాన్సిల్ పై రైల్వే క్లారిటీ

గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ క్యాన్సిల్ పై రైల్వే క్లారిటీ

ఢిల్లీ: మధ్య తరగతివారు కూడా ఏసీ బోగీలో ప్రయాణించే గరీబ్ రథ్ ట్రైన్స్ క్యాన్సిల్ పై క్లారిటీ ఇచ్చింది రైల్వే. అతి తక్కువ ధరలతో ప్రయాణికులకు ఏసీ బోగీ సౌకర్యాన్ని కల్పిస్తున్న గరీబ్‌ రథ్‌ రైళ్లను క్యాన్సిల్ చేసే ఆలోచన లేదని భారతీయ రైల్వేశాఖ శుక్రవారం చెప్పింది.  కొన్ని రోజులుగా వీటిని క్యాన్సిల్ చేస్తారు అంటూ వదంతులు వస్తుండటంతో రైల్వే మంత్రిత్వశాఖ  స్పందించింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద రాకపోకలకు గానూ 26 గరీబ్‌ రథ్‌ రైళ్లు నడుస్తున్నట్టుగా ఆ శాఖ తెలిపింది.

ఉత్తరరైల్వే జోన్‌ లో రైల్వే బోగీల కొరత కారణంగా రెండు వారాంతపు గరీబ్‌ రథ్‌ రైళ్లను రద్దుచేసి వాటిని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా నడుపుతున్నామని, ఆగస్టు 4 నాటికి వాటిని తిరిగి మళ్లీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. 2006లో అప్పటి రైల్వేమంత్రిగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ హయాంలో మధ్యతరగతివారికి ఏసీబోగీ సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో గరీబ్‌రథ్‌ రైళ్లను ప్రారంభించారు. బిహార్‌ లోని సహస్ర నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్టేషన్ల మధ్య మొదటి గరీబ్‌ రధ్‌ రైలు నడిచింది.