
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకంత మజుందార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో 21 ఐఐఎంలు ఉన్నాయని లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2015–16 విద్యా సంవత్సరంలో ఈ 21 ఐఐఎంలలో 7 థర్డ్ జనరేషన్ ఐఐఎంలు వర్గీకరించామని వెల్లడించారు.