
న్యూఢిల్లీ: అగ్నివీర్ స్కీమ్ సాయుధ బలగాలను యుద్ధానికి సిద్ధంగా ఉంచడానికి, యువకులను సైన్యంలోకి తీసుకురావడానికి ఉద్దేశించినదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనిపై రాజకీయాలు అవసరం లేదన్నారు. కేంద్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలకు ఆమె ఈ మేరకు పార్లమెంట్ లో మంగళవారం సమాధానం ఇచ్చారు. ఈ పథకంతో సాయుధ బలగాలు యువశక్తితో మరింత పటిష్టం అవుతాయన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, సాయుధ బలగాల అంగీకారంతోనే దీనిని తీసుకొచ్చామన్నారు.