
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆ రాష్ట్రంలో సీఏఏ బిల్లు కింద స్థానికత పొందాలంటే కొన్ని షరతులు విధించారు. బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్ ముస్లింలను మియా అని పిలుస్తారు. మియా కమ్మూనిటీ బంగ్లాదేశ్ ముస్లింలు ఈ షరతులను పాటిస్తేనే పౌరసత్వం పొందుతారని తెలిపారు. కుటుంబ సభ్యల సంఖ్య పరిమితంగా ఉండాలి, బహుభార్యత్వం, బాల్య వివాహాలు పాటించకూడదని బంగ్లాదేశ్ ముస్లిలకు షరతులు విధించారు.
అస్సామీ రాష్ట్ర సాంస్కృతిక విలువలు, నిబంధనలను గౌరవించడంపై దృష్టి పెట్టాలని మియా కమ్యూనిటీని ముఖ్యమంత్రి కోరారు. కుటుంబ పరిమాణాన్ని ఇద్దరు పిల్లలకు పరిమితం చేయడం, బహుభార్యాత్వాన్ని నిలిపివేయడం, మైనర్ కుమార్తెల వివాహాన్ని నిరోధించడం వంటివి మియా కమ్యూనిటీని ఈశాన్య రాష్ట్రంలో స్థానికులుగా గుర్తించడానికి పాటించాలని శనివారం పేర్కొన్నారు. గతంలో కూడా బాల్య వివాహాలపై అసోంలో హిమంత శర్మ బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా రెండుసార్లు కీలక వ్యాఖ్యలు చేసింది.