
సాధారణంగా మనం హోలి పండుగ ఎలా జరుపుకుంటాం.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తాం. వీధుల్లో డీజే పెట్టి వాటర్ షేవర్లు ఏర్పాటు చేసి వాటి కింద రంగుల నీళ్లతో తడుస్తూ డ్యాన్సులు చేస్తూ సంబరాలు జరుపుకుంటాం.. గ్రామాల్లో అయితే మోదుగు హోలికి ముందు రోజు మోదుగు పూలు తెచ్చి వాటిని ఉడకించి రంగులుతయారు చేస్తారు. వాటితో హోలీ పండుగ రోజు వరసైన వారితో, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, తెలిసిన వారిపై చల్లుతూ వారు మనకు రంగులు పూస్తుంటే ఎంజాయ్ చేస్తారు. అయితే హోలీ సంబరాలను కొంతమంది బిల్డర్లు.. సంప్రదాయ పద్దతులకు వ్యతిరేకంగా అసభ్యకరంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ఈ వీడియోలో విదేశీ మహిళతో అసభ్య కరంగా డ్యాన్సులు చేయిస్తూ.. చేయరాని పనులు చేస్తూ కొంతమంది బిల్డర్లు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. మహిళ అర్థనగ్నంగా డ్యాన్సులు చేస్తుంటే.. కొంత మంది బిల్డర్లు చుట్టు గుమికూడి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఘటన ఆథ్యాత్మికతకు నెలవైన దేవాలయాలు, హిందూ పురాణాల్లో ప్రాముఖ్యత ఉన్న మధురలో జరిగింది. ఈ క్లిప్పింగ్స్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం Xలో పోస్టు చేసిన ఈ వీడియోను చూసిన కొంతమంది ఈ విషయంలో కఠి చర్యలు తీసుకోవాలని మధుర పోలీసులకు ట్యాగ్ చేశారు.
హోలీ భారత దేశ ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఈ పండుగను ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు.. సంతోషం, రంగుల పండుగ అయినప్పటికీ ఇతరులకు అసౌకర్యాన్ని కలిగించకూడదు. మధుర లాంటి ఘటనల కారణంగా హోలీ పండుగ ప్రాముఖ్యత మసక బారిపోయే అవకాశం ఉందని నెటిజన్లు అంటున్నారు.
मथुरा के वृंदावन में होली मिलन समारोह के नाम पर अश्लीलता, विदेशी डांसर के साथ कॉकलेट पार्टी, अर्द्धनग्न कपड़ों में विदेशी महिला डांसर के साथ होली मिलन के नाम पर अश्लील डांस, मथुरा के वृंदावन स्थित ओमेक्स सिटी सोसायटी का बताया जा रहा वायरल वीडियो @mathurapolice #Mathura pic.twitter.com/adW8Gbh1jM
— Arun (आज़ाद) Chahal ?? (@arunchahalitv) March 24, 2024