అంధకారంలో గ్రామపంచాయతీలు

అంధకారంలో గ్రామపంచాయతీలు

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పలు గ్రామ పంచాయతీలు అంధకారంలోకి వెళ్లాయి. విద్యుత్ శాఖ అధికారులు పంచాయతీలకు కరెంటు సరఫరా నిలిపివేశారు. అసలు విషయం ఏంటంటే..గ్రామపంచాయతీలు విద్యుత్ శాఖకు రూ. కోటి 15 లక్షల 30 వేల 824 విద్యుత్ బకాయిపడ్డాయి. ముధోల్ లో అత్యధికంగా రూ. 50లక్షల 72వేల 118 విద్యుత్ బకాయి ఉంది. ఈ క్రమంలో విద్యుత్ శాఖ కరెంటు కట్ చేసింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పంచాయతీ రోడ్లు, వీధులు చీకటైపోయాయి.