
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్హైదరాబాద్కు తాగునీటిని అందిస్తున్న మంజీరా బ్యారేజీ గేట్లు పనిచేయడం లేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మెట్రోవాటర్‌బోర్డు అధికారులు వెల్లడించారు. ఈసందర్భంగా ఆదివారం బోర్డు అధికారులు మంజీరా బ్యారేజ్ ను సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. కొందరు కావాలనే మంజీరా గేట్లు పని చేయడం లేదని దుష్రచారం చేస్తున్నారని అన్నారు.
గేట్లు అన్నీ సక్రమంగా పనిచేస్తూ కార్యనిర్వహణలో ఉన్నాయని.. ప్రస్తుతం మంజీరా 2 క్రెస్ట్ గేట్లు, 1 స్కవర్ వెంట్ ద్వారా 15,130 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. అలాగే సింగూర్ నుండి ప్రవాహం 9,226 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉందన్నారు. గేట్లలో ఎటువంటి అంతరాయం లేకుండా సగటున 46,000 క్యూసెక్కులతో మొత్తం 28.09 టీఎంసీని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.