ఈ కామర్స్​ కంపెనీలకు నో రిలాక్సేషన్​

ఈ కామర్స్​ కంపెనీలకు నో రిలాక్సేషన్​
  • నిత్యావసరాల డెలివరీకి మాత్రమే అనుమతి
  • లాక్​డౌన్​ లో నాన్​ ఎసన్షియల్​ గూడ్స్​ అమ్మకానికి నో
  • ఈ కామర్స్​ రూల్స్​లో మళ్లీ మార్పులు చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: లాక్​ డౌన్​ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు తప్ప ఇతర వస్తువులను ఈకామర్స్​ కంపెనీలు అమ్మడానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం నుంచి హాట్​స్పాట్లు కానీ ప్రాంతాల్లో కొన్ని కార్యకలాపాలు, సర్వీసులకు మినహాయింపు ఇస్తున్నట్టు ఓ లిస్ట్​ను శనివారం కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం ప్రకటించిన గైడ్​ లైన్స్​లో కూడా ఈ కామర్స్​ కంపెనీలకు లాక్​డౌన్​ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్​ ప్రకారం.. ఈ కామర్స్​ కంపెనీలైన అమెజాన్, ఫ్లిఫ్​కార్ట్, స్నాప్​డీల్.. మొబైల్​ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్​లు, ల్యాప్​టాప్స్, క్లాత్స్, స్కూల్​ పిల్లలకు స్టేషనరీ ఐటమ్స్​ మొదలైనవి అమ్మవచ్చు. తమ డెలివరీ వాహనాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్మిషన్​ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేలా, చిన్న వ్యాపారులను దెబ్బ తీసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని కాంగ్రెస్​ పార్టీ ఆరోపించింది. ఈ విమర్శల నేపథ్యంలో ఆదివారం తాజా గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ ఈ కామర్స్​ కంపెనీలు లాక్​డౌన్​ టైమ్​లో నిత్యావసర వస్తువులు తప్ప.. మిగతా వస్తువులు అమ్మడానికి లేదని ప్రకటించింది. మే 3 వరకూ ఈ గైడ్​లైన్స్​ వర్తిస్తాయని, అందరూ తప్పకుండా వీటిని పాటించాలని స్పష్టం చేసింది.