ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో నో సేఫ్టీ! హైదరాబాద్ సిటీలో600 బస్సులు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో నో సేఫ్టీ! హైదరాబాద్ సిటీలో600  బస్సులు
  • ప్రయాణికుల భద్రతపై నిర్లక్ష్యం వహిస్తున్న ఆపరేటర్లు
  •     భద్రతా ప్రమాణాలు అంతంత మాత్రమే.. ప్రమాదంలో అలర్ట్​ చేసే వ్యవస్థే ఉండదు..
  •     కనిపించని ఎమర్జెన్సీ ఎగ్జిట్.. ఫస్ట్​ ఎయిడ్​ కిట్స్​
  •     ప్రమాదాలకు కారణమవుతున్న స్లీపర్​ బస్సుల్లో డిజైన్ ​లోపాలు 
  •     పండుగల సందర్భంగా ప్రైవేట్ ​బస్సులపై ఆర్టీఏ 163 కేసులు.. అయినా మారని తీరు 

హైదరాబాద్​సిటీ, వెలుగు:ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. భద్రతా ప్రమాణాల కొరత వల్ల తరుచూ తీవ్ర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ స్లీపర్ బస్సుల్లో మంటలు చెలరేగడం, డోర్లు జామ్ అవడం, ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడంలాంటి సమస్యలు ప్రయాణికుల ప్రాణానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ప్రైవేట్​ట్రావెల్స్​ యాజమాన్యాలు ఆకర్షణీయమైన డిజైన్లతో బస్సులను రోడ్లపైకి తీసుకువస్తున్నాయి.  

రకరకాల డెకొరేషన్లు, తళుబెళుకులతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. నగరంలో దాదాపు 600 ప్రైవేట్​ ట్రావెల్స్​బస్సు సర్వీసులు ఉన్నాయి. ప్రైవేట్​ట్రావెల్స్​ నిర్వహకులు అత్యాధునిక బస్సులతో నగరం నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సర్వీసులు అందిస్తున్నారు. నిర్వాహకులు ఎంతగా ధరలు పెంచినా చాలా మంది  లగ్జరీ ప్రయాణం కోసం వీటినే ఎంచుకుంటున్నారు. కానీ.. ఆపరేటర్లు బస్సుల ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్​, ప్రయాణికుల భద్రత, బస్సులో అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండాల్సిన సౌకర్యాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.

 దీంతో ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా.. హైదరాబాద్​ నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సు(వేమూరి కావేరి ట్రావెల్స్​) కర్నూలు వద్ద ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. 2013 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా పాలెం వద్ద ఇదే తరహాలో ప్రైవేట్​బస్సు (జబ్బార్​ ట్రావెల్స్​) దగ్ధం అయింది. అలాంటి ప్రమాదమే ఇప్పుడు మళ్లీ చోటు చేసుకోవడంతో  ప్రైవేట్​ బస్సుల భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 

అసలు ప్రైవేట్​ఆపరేటర్లు బస్సుల నిర్వహణ, ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు తూతూమంత్రంగానే చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడే హడావిడి చేస్తున్న అధికారులు.. మళ్లీ ఇలాంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు మాత్రం తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్​బస్సుల డ్రైవర్ల ర్యాష్​ డ్రైవింగ్, నిర్లక్ష్యంతోపాటు సేఫ్టీ మెజర్స్​ తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.  

స్లీపర్​ బస్సులతో మరింత ప్రమాదం

ప్రైవేట్​ ట్రావెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్సులన్నీ కూడా దాదాపు స్లీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగుళూరు, మహారాష్ట్ర , నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, ముంబై, అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి అనేక ప్రాంతాలకు రాత్రి సమయాల్లోనే ప్రయాణిస్తుంటాయి. ఈ బస్సుల డిజైన్లలోనూ లోపాలున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇందులో ప్రయాణికులు సులభంగా కలియతిరిగేందుకు అవకాశం కూడా ఉండడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే బయట పడడానికి అవకాశాలు తక్కువే. 

బస్సును పూర్తిగా కర్టెన్లతో మూసి ఉంచడంతో ఎమెర్జెన్సీ కిటికీ ఎక్కడుందో తెలియని పరిస్థితి. బస్సులో సౌకర్యాలు కూడా తక్కువే. తరచూ బస్సులను తనిఖీ చేయాల్సిన ఆర్టీఏ అధికారులు కేవలం పండుగల సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే స్పెషల్​ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్వహిస్తున్నారు. సాధారణ రోజుల్లోనూ తనిఖీలు చేస్తే ప్రైవేట్​ఆపరేటర్ల నిర్లక్ష్యం బయటపడుతుంది. గతంలో కాంట్రాక్టు క్యారేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్సులు మధ్యలో ఎక్కడా ప్రయాణికులను ఎక్కించుకునే అవకాశం ఉండేది కాదు. 

కానీ, ప్రస్తుతం వీటికి ఆల్​ఇండియా పర్మిట్లు ఇవ్వడంతో ప్రయాణికులను ఎక్కడి నుంచైనా ఎక్కించుకొని వెళ్తున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో బస్సులు ఓవర్​లోడ్​అవుతున్నాయి. సాధారణంగా ఎంత హైటెక్​బస్సైనా 45 నుంచి 50 మంది ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్లాలి. కానీ, కొందరు ప్రైవేట్​ఆపరేటర్లు 60 నుంచి 65 మందిని ఎక్కించుకుంటున్నారు. ఈ బస్సుల్లో మెయిన్​ఎంట్రెన్స్, ఎగ్జిట్​డోర్​ఒక్కటే కావడం, కేవలం డ్రైవర్ క్యాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే తలుపులు ఉండడం పెద్ద లోపంగా మారింది. కిటికీలన్నీ క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో ఎక్కువ సేపు ప్రయాణం చేయడం వల్ల ఆక్సిజన్ స్థాయి తగ్గి కార్బన్ డయాక్సైడ్ పెరగడానికి కారణమవుతున్నది. అలాగే, బస్సులోని వాసనలు కూడా లోపలే నిలిచిపోతున్నాయి. 

బస్సుల ఎత్తు ప్రధాన సమస్య..

స్లీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్సుల ఎత్తు కూడా ప్రయాణికులకు మరో ప్రధాన సమస్యగా మారుతున్నది. సాధారణంగా వీటి ఎత్తు 4–-9 అడుగుల వరకు ఉంటున్నది. ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒక వైపునకు ఒరిగిపోతే ప్రయాణికులు కిటికీలను లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను చేరడం కష్టంగా మారుతున్నది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా ఆటంకం కలుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. బస్సెక్కిన ప్రయాణికులను బయటకు తీసేలోపు మృతుల సంఖ్య పెరుగుతున్నదని అంటున్నారు. 

సాధారణంగా స్లీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్సుల్లో 2 x 1 సీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. 30 నుంచి 36 బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. అదే మల్టీ యాక్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్సులైతే 36- నుంచి 40 మంది ప్రయాణించొచ్చు. ఒక్కో బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అయితే బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అనుసంధానించే గ్యాలరీతోనే ఇక్కడ సమస్య ఏర్పడుతున్నది. ప్రయాణికులు సులభంగా తిరిగే అవకాశం ఉండడం లేదు. ప్రమాదాలు జరిగితే మాత్రం ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఈ బస్సుల్లోనే ఎక్కువని అధికారులు చెబుతున్నారు. 

దసరా, దీపావళి సందర్భంగా.. 

దసరా, దీపావళి సందర్భంగా స్పెషల్​డ్రైవ్​పెట్టి నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్​బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సందర్భంగా అధిక శాతం బస్సుల్లో ఫైర్ సేఫ్టీతోపాటు ఎమర్జెన్సీ అలారం, ఫస్ట్​ఎయిడ్​లాంటి సౌకర్యాలు లేవని గుర్తించారు. రూల్స్​పాటించని బస్సుల ఓనర్లపై 163 కేసులు నమోదు చేశారు. భారీస్థాయిలో జరిమానాలు వేసినా వారిలో మార్పు రావడం లేదు .

భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం

ప్రైవేట్​ బస్సుల నిర్వాహకులు ఆదాయంపైనే దృష్టి పెట్టి.. ప్రయాణికుల భద్రత విషయంలో  నిర్లక్ష్యం వహిస్తున్నారు.  ముఖ్యంగా రోడ్లపైకి ఆయా కంపెనీలు ఆకర్షణీయమైన డిజైన్లతో పడవల మాదిరిగా బస్సులను తీసుకువస్తున్నాయి.. కానీ వాటిలో ప్రయాణించే వారికి ప్రమాదం జరిగిన సమయంలో అలర్ట్​ చేసే వ్యవస్థ కానీ, బస్సులోంచి భద్రంగా బయట పడే వెలుసులుబాటు కల్పించడం లేదు. ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం లేదు. 

ఇక అగ్ని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పేందుకు ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేఫ్టీ పై అధికశాతం మంది ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే, ప్రయాణికుల కోసం బస్సుల్లో ఫస్ట్​ఎయిడ్​బాక్సులు కూడా అందుబాటులో ఉంచడం లేదు. ఇక బస్సుల్లో ప్రమాదం జరిగితే బయటపడేందుకు ఏర్పాటు చేసే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్​ఎక్కడున్నాయో కూడా కూడా ప్రయాణికులకు తెలియడం లేదు. బస్సు మొత్తాన్ని అద్దాలతో మూసేస్తున్నారు. 

ఇన్ని లోపాలున్న బస్సుల్లో ప్రయాణించే వారికి భద్రతకు గ్యారెంటీ లేకుండా పోయింది. అసలు బస్సుల డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే అనేక లోపాలుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన బస్సులో కూడా మాన్యుఫ్యాక్చరింగ్​లోపాలు ఉన్నట్టు కర్నూల్​రేంజ్​ఐజీ కోయ ప్రవీణ్​ పేర్కొనడం సంచలనంగా మారింది. ప్రమాదాలకు గురైతే ప్రయాణికుల ప్రాణ నష్టం తగ్గించేలా మెటీరియల్​ వాడడం లేదని ఆయన వెల్లడించారు.