వ్యాక్సిన్ అందుబాటుపై సూచనలేవి?: రాహుల్

వ్యాక్సిన్ అందుబాటుపై సూచనలేవి?: రాహుల్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై పదే పదే విమర్శలకు దిగుతున్న కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు సర్కార్‌‌పై మండిపడ్డారు. ఈసారి కరోనా వ్యాక్సిన్‌ విషయంలో గవర్నమెంట్‌ను టార్గెట్‌గా చేసుకొని కామెంట్స్ చేశారు. దేశంలో వైరస్ బారిన పడి 3 మిలియన్‌కు పైగా ప్రజలు బాధపడుతున్నారని, ఈ సమయంలో వ్యాక్సిన్ అందుబాటులో లేదంటూ సర్కార్‌‌ను రాహుల్ దుయ్యబట్టారు. సరైన స్ట్రాటజీతో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. కానీ దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి సూచనలు కనిపించడం లేదన్నారు. గవర్నమెంట్ ఆఫ్​ ఇండియా సంసిద్ధంగా లేకపోవడం హెచ్చరిస్తోందంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థ పతనంపై తన హెచ్చరికలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా వ్యాఖ్యల ద్వారా క్లారిటీ వచ్చిందనే ట్వీట్‌ను జత చేశారు.