వాసన, రుచి తెలియకపోవడమూ కరోనా లక్షణమే

వాసన, రుచి తెలియకపోవడమూ కరోనా లక్షణమే
  •  రీసెర్చ్‌లో వెల్లడి
  • 2.5 మిలియన్ల మందిపై సర్వే 

న్యూయార్క్‌: వాసన, రుచిని కోల్పోవడం కరోనా లక్షణం అని పరిశోధకులు చెప్తున్నారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌, యూఎస్‌లోని దాదాపు 2.5 మిలియన్ల మందిపై రిసెర్చ్‌ జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు. సింప్టమ్‌ ట్రాకింగ్‌ యాప్‌ ద్వారా ఈ రిసెర్చ్‌ నిర్వహించారు. ఈ మేరకు నేచర్‌‌ మెడిసిన్‌ ఒక జర్నల్‌ను రిలీజ్‌ చేసింది. మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 21 మధ్య స్టడీ చేసి ఈ విషయాలు చెప్పారు. యూకే, యూఎస్‌, స్వీడన్‌లో స్టడీ చేసిన వారిలో చాలా వరకు టేస్ట్‌, వాసన కోల్పోయామని చెప్పారని కరోనా సోకిందనేందుకు అదే మొదటి లక్షణం అని తేలిందన్నారు. వాటితో పాటు కీళ్లనొప్పులు కూడా వస్తాయని అన్నారు. దాదాపు 17 శాతం మందికి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వాళ్లలో దాదాపు 65 శాతం మంది వాసన, రుచిని కోల్పోయారు. యూకేలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి యాప్‌లో అడిగిన 10 లక్షణాలు ఉన్నాయని, కానీ యూఎస్‌లో మాత్రం టేస్ట్‌, వాసన కనిపెట్టలేకపోవడం, అలసట, భోజనం స్కిప్‌ చేయడం లాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కరోనా లక్షణాల ట్రాకింగ్‌ వల్ల ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా తెలుసుకోవచ్చని డాక్టర్లు చెప్పారు. చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ సడలిస్తున్న నేపథ్యంలో లక్షణాలు గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తసుకుంటే కమ్యూనిటీ కాంటాక్ట్‌ తగ్గిచొచ్చని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ను కనిపెట్టేందుకు టెస్టులు చేయడమే సరైన మార్గమని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.