హైవేలో పెట్రోల్ బంకులు ఖాళీ.. వాహనదారుల టెన్షన్

హైవేలో పెట్రోల్ బంకులు ఖాళీ.. వాహనదారుల టెన్షన్

హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పెట్రోల్ బంకులు అన్నీ ఖాళీ అయ్యాయి. 70 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రతి 8 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఒక పెట్రోల్ బంకు ఉంది. ఏ బంకులోనూ పెట్రోల్, డీజీల్ నో స్టాక్ అనే బోర్డులు ఉండటంతో.. వాహనదారులు టెన్షన్ పడ్డారు. సహజంగా హైవేపై వెళుతున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ.. చాలా ఎక్కువ స్థాయిలో పెట్రోల్ బంకులు ఉండటంతో.. వాహనదారులు ఇన్నాళ్లు టెన్షన్ పడులేదు. అయిపోయినప్పుడు కొట్టించుకుందాం.. తక్కువ అయినప్పుడు ఫిల్ చేసుకుందాం అనే ఉద్దేశంలో ఉంటారు. డిసెంబర్ 31 తేదీ మాత్రం హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించిన వాహనదారులకు చెమటలు పట్టించాయి పెట్రోల్ బంకులు..

2024, జనవరి ఒకటో తేదీ నుంచి పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయి.. లీటర్ పెట్రోల్ పై 10 రూపాయలు తగ్గింపు ఉంటుందనే వార్తలతో.. పెట్రోల్ బంకు యజమానులు స్టాక్ ఆర్డర్ ఇవ్వలేదు. ఎక్కువ ధరలో స్టాక్ కొనుగోలు చేస్తే.. ధర తగ్గినప్పుడు నష్టం వస్తుందనే ఉద్దేశంతో.. ఉన్న స్టా్క్ మొత్తాన్ని ఖాళీ చేశారు యజమానులు. దీంతో 70 శాతం పెట్రోల్ బంకులు ఖాళీ అయ్యాయి. నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. ఈ బంకు కాకపోతే.. ముందు ఉన్న బంకు అంటూ వస్తూ ఉన్న వాహనదారులకు.. ప్రతి బంకులో నో స్టాక్ అనే బోర్డులు కనిపించటంతో హైరానా పడ్డారు. ఏపీ నుంచి తెలంగాణలోకి ఎంట్రీ అయిన తర్వాత.. దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. నార్కెట్ పల్లి చౌరస్తా వచ్చే వరకు ఇదే టెన్షన్ పడ్డారు వాహనదారులు. 

పెట్రోల్, డీజీల్ రేట్లు తగ్గుతాయనే వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అధికారిక ప్రకటన చేయలేదు. పెట్రోల్ రేట్లు తగ్గొచ్చు అనే సూచనలు అంటూ వార్తలు వచ్చాయి.. అయినా పెట్రోల్ బంకు యజమానులు.. స్టాక్ తెప్పించటానికి భయపడ్డారు. నష్టంతో ఎందుకు అమ్మాలనే ఉద్దేశంతో.. రెండు రోజల ముందు నుంచే పెట్రోల్, డీజీల్ కోనుగోలు చేయటం ఆపేశారు. దీంతో స్టాక్ లేక.. జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు.. 

మీరు జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నట్లయితే.. ముందుగానే అలర్ట్ అవ్వండి.. సిటీలోనే ఫుల్ ట్యాంక్ కొట్టించుకోండి.. హైవేపై చాలా బంకులు ఉన్నాయి కదా అనే నిర్లక్ష్యం.. అశ్రద్ధ అస్సలు వద్దు...