ఆ ‘యాప్‌‌‌‌’లతో మనోళ్లు బరువు తగ్గుతలేరు

ఆ ‘యాప్‌‌‌‌’లతో మనోళ్లు బరువు తగ్గుతలేరు

యాప్స్.. యాప్స్.. యాప్స్.. ఇవి లేని ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండవు, వీటిని వాడని జనాలుండరు. లక్షల యాప్స్ ఉంటే.. కోట్లాది కస్టమర్లు ఉంటున్నారు. ఆఖరికి బరువు తగ్గేందుకు ఈ యాప్స్​నే ఫాలో అవుతున్నారు. మనం ఏమేం తినాలి, ఎంత తినాలి.. మనం ఎంత నడుస్తున్నం, దాంతో ఎన్ని కేలరీలు ఖర్చయినయి.. అనే వివరాలు తెలుసుకునేందుకు చాలా మంది గూగుల్‌‌‌‌ ప్లే స్టోర్‌‌‌‌ నుంచి యాప్‌‌‌‌లను డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసేస్తున్నారు. ఆ యాప్‌‌‌‌ చెప్పినట్లే తింటున్నారు. అది చేసిన సూచనలనే పాటిస్తున్నారు. కానీ చాలా మంది సత్ఫలితాలు పొందలేకపోతున్నారు. గూగుల్‌‌‌‌ ప్లే స్టోర్‌‌‌‌లో అత్యధిక రేటింగ్‌‌‌‌ ఉన్న కేలరీ కౌంటింగ్‌‌‌‌ యాప్‌‌‌‌ల్లో శాస్త్రీయత ఎంతో తెలుసుకునేందుకు నేషనల్‌‌‌‌ ఇన్​స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ న్యూట్రిషియన్‌‌‌‌ (ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌) స్టడీ చేసింది. ఈ స్టడీ విశేషాలు ఓ ఇంటర్నేషనల్‌‌‌‌ జనరల్‌‌‌‌లో ఇటీవల పబ్లిష్‌‌‌‌ అయ్యాయి. ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌ సైంటిస్టులు ముందుగా 30 మందిని ఎంపిక చేసి వివిధ యాప్​లను అనుసరించాలని వారికి సూచించారు. అయితే వారందరికీ భిన్నమైన ఫలితాలు వచ్చాయి. 66 కిలోల బరువు, 163 సెంటిమీటర్ల ఎత్తు ఉన్న 22 ఏళ్ల యువతి వారానికి 500 గ్రాముల బరువు తగ్గేందుకు రోజుకు ఎన్ని కేలరీల ఫుడ్‌‌‌‌ తీసుకోవాలి, ఎంత నడవాలి అని తెలుసుకునేందుకు 20 యాప్‌‌‌‌ల్లో పరిశీలించగా.. 20 రకాల సూచలు వచ్చాయి. వచ్చిన సూచనలు కూడా మన దేశ ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా లేవని ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌ సైంటిస్టులు గుర్తించారు. ఇక్కడి ప్రజల ఆహార అవసరాలు, చేసే పనులకు అనుగుణంగా యాప్‌‌‌‌లను రూపొందించలేదని ఈ రీసెర్చ్​కు నేతృత్వం వహించిన ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌ సెంటిస్ట్‌‌‌‌ సుబ్బారావు వెల్లడించారు.