రెండేండ్ల దాకా 25 శాతం జనానికి వ్యాక్సిన్ డౌటే!

రెండేండ్ల దాకా 25 శాతం జనానికి వ్యాక్సిన్ డౌటే!

కరోనా వ్యాక్సిన్ పంపిణీ పెద్ద సవాలే.. బీఎంజే జర్నల్ స్టడీలో వెల్లడి

వాషింగ్టన్: ప్రపంచంలోని దాదాపు నాలుగో వంతు జనాభాకు 2022 వరకూ కరోనా వ్యాక్సిన్ అందకపోవచ్చునని ఓ స్టడీ పేర్కొంది. ఒకవేళ అన్ని కంపెనీల వ్యాక్సిన్లు సక్సెస్ అయి, పెద్ద ఎత్తున తయారు చేసినా… 2022 వరకు ప్రపంచంలోని ఐదొంతుల జనాభాకు టీకా అందకపోవచ్చునని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ పెద్ద సవాలేనని హెచ్చరించింది. అమెరికాలోని జాన్ హోప్కిన్స్ బ్లూమ్ బర్గ్ స్కూల్ ఆఫ్​పబ్లిక్ హెల్త్ కు చెందిన రీసెర్చర్లు చేసిన ఈ స్టడీ.. బీఎంజే జర్నల్ లో పబ్లిష్ అయింది. ధనిక దేశాలన్నీ వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాయని.. కానీ ఏం చేయాలో తెలియని స్థితిలో పేద, మధ్య తరగతి దేశాలు ఉన్నాయని రీసెర్చర్లు ఆందోళన వ్యక్తం చేశారు. 2020 నవంబర్ 15 వరకే కొన్ని దేశాలు 376 కోట్ల వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చాయని తెలిపారు. వీటిలో సగం ధనిక దేశాలకే వెళ్తాయని చెప్పారు. అయితే ప్రపంచ జనాభాలో 15శాతం ధనిక దేశాల్లో ఉండగా… మిగిలిన 85శాతం పేద, మధ్య తరగతి దేశాల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని దేశాలకూ సమానంగా వ్యాక్సిన్ అందేందుకు గాను ప్రభుత్వాలు, తయారీ కంపెనీలు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

2021 ఆఖరుకు 596 కోట్ల వ్యాక్సిన్లు.. 

ప్రస్తుతం 13 కంపెనీలకు చెందిన 48 వ్యాక్సిన్ క్యాండిడేట్లు ట్రయల్స్ దశలో ఉన్నాయని స్టడీ పేర్కొంది. ఇవన్నీ సక్సెస్ అయితే 2021 ఆఖరు వరకు 596 కోట్ల వ్యాక్సిన్లు రెడీ అవుతాయని తెలిపింది. అయితే వీటిలో 40 శాతం వ్యాక్సిన్లు  మాత్రమే పేద, మధ్య తరగతి దేశాలకు అందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి ధనిక దేశాలు ఎలా సహకరిస్తాయనే దానిపైనే ఇది ఆధారపడి ఉందని వెల్లడించింది. గ్లోబల్, రీజనల్, నేషనల్ లెవల్ లో వ్యాక్సిన్ల పంపిణీకి సరైన విధానం అవసరమని మరో స్టడీ పేర్కొంది.

వ్యాక్సిన్ తీస్కోవడానికి ట్రంప్ రెడీ : వైట్​హౌస్​

కరోనా వ్యాక్సిన్​ను ఓపెన్​గా తీసుకోవడానికి ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధంగా ఉన్నారని వైట్‌హౌస్‌​ బుధవారం ప్రకటించింది. వైరస్​ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న ఫ్రంట్ లైన్​ వర్కర్లకు వ్యాక్సినేషన్ లో ఆయన ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారని తెలిపింది. ఈ మధ్యే కరోనా నుంచి కోలుకోవడంతో యాంటీ బాడీస్‌ ఉన్నందున ట్రంప్‌ కు ఇబ్బందిలేదని చెప్పింది. ఒకవేళ డాక్టర్స్‌ సిఫారసు చేస్తే మాత్రం కచ్చితంగా తీసుకుంటారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కెలీగ్‌ మెక్ఎనాని చెప్పారు. వ్యాక్సిన్‌ను ట్రంప్‌ బహిరంగంగా తీసుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ జవాబిచ్చారు. యూఎస్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫైజర్‌‌ అభివృద్ధిచేసిన టీకాకు అమెరికాలో ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతిచ్చారు. ఆ వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు దేశంలోని ప్రముఖులు చాలామంది దాన్ని ఓపెన్​గా తీసుకునేందుకు ముందుకు వచ్చారు.

ఫైటింగ్​ ఇంకా ముగియలే..

బైడెన్‌ ఎన్నికకు సంబంధించిన వ్యాజ్యాలను ప్రెసిడెంట్ ట్రంప్‌ ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారని కెలీగ్‌ చెప్పారు. బుధవారం వచ్చిన రిజల్ట్‌ రాజ్యంగ ప్రక్రియలో మరో మెట్టు అని, ఇక ఆ విషయంపై నిర్ణయం ఆయనకే వదిలేస్తున్నాని ఆమె మీడియాకు వివరించారు. బైడెన్‌ ఎన్నికను సవాలు చేస్తూ ట్రంప్‌ కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పలు రాష్ట్రాల కోర్టులలో ట్రంప్​ లా సూట్​ వేశారు. వీటన్నింటినీ ఆయా కోర్టులు కొట్టేశాయి. తాజాగా, ఎలక్టోరల్​ కాలేజ్​ కూడా బైడెన్​ను ప్రెసిడెంట్​గా ఎన్నుకుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన విడుదలైంది. ట్రంప్​ న్యాయ పోరాటాన్ని కొనసాగించే ఉద్దేశంతోనే ఉన్నారని కెలీగ్​ చెప్పారు.

For More News..

కేటీఆర్‌‌‌‌ను సీఎం చేయడమే కేసీఆర్‌‌‌‌ లక్ష్యం

కేటీఆర్ ఫాంహౌస్ కేసును లోతుగా విచారించాలె: హైకోర్టు సీజే

ఒక్క కౌన్సిల్ హాల్ కట్టడానికి 11 ఏండ్లు పట్టింది