చుక్క నీరు మిగలలేదు.. ఒక్క చేపా బతకలేదు!

చుక్క నీరు మిగలలేదు.. ఒక్క చేపా బతకలేదు!

ఎండల ధాటికి కుంటలు, చెరువులు ఖాళీ అవుతున్నాయి. నదులూ మినహాయింపేమీ కాదు. ఇప్పటికే కొన్ని డ్యాముల్లో నీళ్లు ఆవిరవుతూ డెడ్​ స్టోరేజీ వైపు కదులుతున్నాయి. కొన్ని రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి. ఫొటోలో కనిపిస్తున్నది తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న చెంబరంబక్కం రిజర్వాయర్​. చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. నెర్రెలిచ్చిన భూమిపై చచ్చిపోయిన చేపలు ఇలా పడిపోయి ఉన్నాయి.