
టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తే… తన తడాఖా ఏంటో చూపిస్తామన్నారు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి. ప్రచారంలో కించపరిచే విధంగా తనపై ఆరోపణలు చేశారన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో చరిత్రాత్మక తీర్పు రాబోతుందని.. ఆ తీర్పు దేశానికే ఆదర్శం కాబోతుందన్నారు. తాను ప్రలోభాలకు లొంగే లీడర్ ను కాదన్నారు రేణుకా చౌదరి. ఎన్నికల సమయంలో తనపై చాలా రూమర్లు సృష్టించారని… ప్రజా మర్యాదను, నన్ను ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు.
ఈ ఎన్నికలో నైతిక బాధ్యతగా డబ్బులు పంపిణీ చెయ్యకుండా ఎన్నికల్లో ముందుకు వెళ్ళామన్నారు రేణుకా చౌదరి. ఈ ఎన్నికల్లో ధన రాజకీయం కంటే, ప్రజా రాజకీయం వైపు ప్రజలు మొగ్గు చూపిన తీరు యావత్ దేశానికి ఆదర్శమన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయనీ…. అందుకు సహకరించిన జిల్లా కలెక్టర్, సీపీ, ఎన్నికల సిబ్బందికి అభినందనలు తెలిపారు రేణుకా చౌదరి.