జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు కదిలేది లేదు : ఢిల్లీ నడి రోడ్డుపైనే కూర్చున్న రాహుల్

జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు కదిలేది లేదు : ఢిల్లీ నడి రోడ్డుపైనే కూర్చున్న రాహుల్

దేశ రాజధాని ఢిల్లీ భగ్గుమంటోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. ఓటు దొంగ గద్దె దిగు.. జ్ణానేశ్ కుమార్ రాజీనామా చెయ్ అంటూ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇండియా కూటమి పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఎన్నికల కమిషన్ ఆఫీసు ముట్టడికి వెళ్లిన నేతలను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. నడిరోడ్డుపైనే నిలిపేశారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఎదుట.. నడి రోడ్డుపైనే కూర్చుకున్నారు.

ఎలక్షన్ కమిషన్ చీఫ్ జ్ణానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు కదిలేది లేదంటూ తెగేసి చెప్పారు. ప్రతిపక్షం బీజేపీని కేవలం ఎదుర్కోవడం మాత్రమే కాదని.. బీజేపీని అంతం చేస్తాం అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.దేశానికి జరిగిన నష్టాన్ని దేశద్రోహంగా ఆయన అభివర్ణించారు.ఈ వ్యవహారంలో ఎవరూ తప్పించుకోలేరని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఓట్లు దొంగిలించిన ఎన్నికల కమిషనర్,ప్రధాన మంత్రి  దిగిపోవాల్సిందే నని తెగేసి చెప్పారు.  దీంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.

ఈసీ పనితీరు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ మంగళవారం (అక్టోబర్ 6) సేమ్ డెమొక్రసీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయ ముట్టడికి విపక్షాలు పిలుపునిచ్చాయి. పార్లమెంట్ మకర్ ద్వార్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ప్రతిపక్ష ఎంపీలు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీకి అనుమతి లేకపోవడంతో విపక్ష కూటమి ఎంపీలను జీఎస్టీ భవన్ దగ్గర బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు.

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోన్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ఎంపీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు నినాదాలు హోరెత్తించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బారికేడ్పైకి ఎక్కి త్రివర్ణ పతాకం ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఓట్ చోరీకి పాల్పడుతోన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ పునరుద్ఘాటించారు.

ALSO READ : కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక అరెస్ట్.. ఢిల్లీలో హై టెన్షన్