
లక్నో: దేశంలో సంచలనం సృష్టిస్తోన్న నోయిడా కట్నం కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విపిన్ భాటి సోదరుడు రోహిత్ భాటిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హర్యానాలోని సిర్సా టోల్ సమీపంలో పక్కా సమాచారం మేరకు సోమవారం (ఆగస్ట్ 25) నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు రోహిత్ భాటిని అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు. ఈ కేసులో ఇది మూడో అరెస్ట్. ఇప్పటికే ప్రధాన నిందితుడు విపిన్ భాటి, అతడి తల్లిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. తాజాగా నిందితుడి సోదరుడిని అరెస్ట్ చేయగా.. నిందితుడు తండ్రి పరారీలో ఉన్నాడని తెలిపారు పోలీసులు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా చెందిన నిక్కీ, ఆమె అక్క కాంచన్‌ను సిర్సా గ్రామానికి చెందిన విపిన్‌సోదరులకు ఇచ్చి 2016లో పెండ్లి చేశారు. ఆ సమయంలో భారీ మొత్తంలో నగదు, కారు, బైక్ ఇచ్చినప్పటికీ అదనంగా 36 లక్షలు తేవాలని నిక్కీని ఆమె భర్త విపిన్ వేధించినట్లు కాంచన్‌ఆరోపించారు. ఈ క్రమంలోనే అత్తామామలతో కలిసి విపిన్‌తన అక్కను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి కొట్టారని, యాసిడ్‌పోసి నిప్పంటించి చంపేశారని తెలిపారు. అడ్డుకునేందుకు యత్నించిన తనపై దాడిచేయడంతో సోయితప్పి పడిపోయానని చెప్పారు. మృతురాలు నిక్కీ సోదరి కాంచన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ప్రధాన నిందితుడు విపిన్‌ను పోలీసులు శనివారం (ఆగస్ట్ 23) అరెస్ట్ చేశారు. సీన్‌రీకన్‌స్ట్రక్షన్ కోసంఆదివారం (ఆగస్ట్ 24) స్పాట్‌కు తీసుకెళ్లగా విపిన్‌పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఓ పోలీసు నుంచి రివాల్వర్‌లాక్కుని పరిగెత్తగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు విపిన్పై కాల్పులు జరిపారు. బులెట్‌కాలుకు తగలడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. మరోవైపు.. తన కూతురును దారుణంగా చంపిన విపిన్‌ను ఎన్‌కౌంటర్‌చేయాలని మృతురాలి తండ్రి డిమాండ్‌చేశారు. ఇటీవల తాను బెంజ్‌కారు కొన్నప్పటి నుంచి నిక్కీపై వేధింపులు పెరిగాయని, ఆ కారైనా ఇవ్వాలి, లేదంటే 40 లక్షలైనా తేవాలంటూ తన కూతురుపై దాడి చేశారని ఆరోపించారు.