నోయిడా: ఎలక్టోరల్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పని ఒత్తిడి భరించలేక స్కూల్ టీచర్ ఉద్యోగానికి ఓ మహిళ రాజీనామా చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో)గా నియమితులైన ఆ మహిళ తన అసిస్టెంట్ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సర్ బాధ్యతలతో పాటు బోధించడం కష్టతరం అవుతున్నదని తన రాజీనామా లేఖలో వివరించారు.
నోయిడాలోని సెక్టార్ 94లో ఉన్న గేజా హయ్యర్ ప్రైమరీ స్కూల్లో పింకీ సింగ్ టీచర్‌గా పని చేస్తున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోగా విధులు నిర్వహిస్తున్నారు. 215 మంది ఓటర్లకు సంబంధించిన ఎంట్రీలను ఇప్పటికే ఆన్లైన్లో సమర్పించారు. ఒకేసారి రెండు బాధ్యతలను నిర్వహించడం తన వల్ల కాదంటూ తాజాగా రిజైన్ చేశారు.
