చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ నోకియా ఇండియా మార్కెట్లోకి సీ22 పేరుతో బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6.5–అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా–కోర్ యూనిసాక్ ఎస్సీ9863 ఏ ప్రాసెసర్, వెనుక రెండు కెమెరాలు, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.
ఇది ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఓఎస్‌తో నడుస్తుంది. 2జీబీ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.ఎనిమిది వేలు, 4జీబీ + 64జీబీ వేరియంట్‌కు రూ. 8,499 చెల్లించాలి.
